విపక్షాలకు శరద్ పవర్ షాక్.. రాష్ట్రపతి ఎన్నికకు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థి కోసం ప్రతిపక్ష పార్టీలు ఏకమవుతోన్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధినేత శరద్ పవార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి రేసుకు దూరంగా ఉండాలని పవార్ నిర్ణయించుకున్నట్లు ఎస్సీపీ వర్గాలు వెల్లడించారు. ఎన్సీపీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీలో పవార్ మాట్లాడుతూ నేను రాష్ట్రపతి రేసులో లేను. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఉండబోను అని చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడిరచాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలు తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు అవసరమైన సంఖ్యాబలాన్ని కూడగట్టుకోవడంలో సఫలమవుతాయన్న దానిపై పవార్ నమ్మకంగా లేరట. అందుకే ఓడిపోయే పోరులో బరిలో దిగేందుకు ఆయన సుముఖంగా లేరని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన అభిప్రాయాన్ని పవార్ ఇంకా విపక్ష పార్టీలకు చెప్పలేదు. కాగా రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్షాల తరపున 81 ఏళ్ల శరద్ పవర్ పేరు ప్రముఖంగా వినిపించిన విషయం తెలిసిందే.













