కేంద్ర ఏజెన్సీల దుర్వినియోగం ఇది : శరద్ పవార్
కేజ్రీవాల్ అరెస్టును నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు శరద్ పవార్ తీవ్రంగా ఖండించారు. అధికారం కోసం బిజెపి ఎంతకు తెగిస్తుందో, ఎంత లోతుకు దిగుతుందో కేజ్రీవాల్ అరెస్టుతో అర్థమవుతుందని విమర్శించారు. ‘ప్రతిపక్షా పార్టీలను వేధించడానికి కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేయడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలు సమీపిస్తు వేళ అధికారం కోసం బిజెపి ఎంతకు తెగిస్తుందో ఈ అరెస్టుతో అర్ధమవుతుంది. ఈ రాజ్యాంగ విరుద్ధ చర్యకు వ్యతిరేకంగా ‘ఇండియా’ వేదిక ఐక్యంగా నిలుస్తుంది’ అని శరద్ పవార్ తెలిపారు.













