ఎన్సీపీ అధినేత కీలక నిర్ణయం… వర్కింగ్ ప్రెసిడెంట్ గా
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శర్ పవార్ పార్టీ బాధ్యతల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీకి కొత్తగా ఇద్దరిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా ప్రకటించారు. అయితే, ఇందులో కీలక నేత అజిత్ పవార్ కు చోటు దక్కకపోవడం గమనార్హం. తన కుమార్తె సుప్రియా సూలే, సీనియర్ నేత ప్రపుల్ పటేల్ కు పవార్ ఈ బాధ్యతలు అప్పగించారు. ఎన్సీపీ పార్టీ 25వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ముంబయిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులోనే పవార్ వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లను వెల్లడించారు. ఈ కార్యక్రమానికి అజిత్ పవార్ కూడా హాజరయ్యారు. ఆయన ఎదుటే ఈ ప్రకటన వెలువడిరది. వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సుప్రియా సూలేకు మహారాష్ట్ర, హరియాణా, పంజాబ్, విమెన్ యూత్, లోక్‌సభ కో ఆర్డినేషన్ బాధ్యతలను అప్పగించారు. ఇక ప్రపుల్ పటేల్‌కు మధప్రదేశ్, రాజస్థాన్, గోవా వ్యవహారల బాధ్యతలను అప్పగించారు.













