అంతర్జాతీయ టూరిజం ఫెయిర్‌కు ఆహ్వానం అందుకున్న పర్యాటక మంత్రి కిషన్ రెడ్డి
తెలంగాణ బీజేపీ అధ్యక్షులు, కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి సెర్బియా నుంచి ఆహ్వానం అందింది. ఆ దేశంలో 45వ అంతర్జాతీయ టూరిజం ఫెయిర్ (ఐటీఎఫ్) జరగనుంది. ఫిబ్రవరి 22 నుంచి 25 వరకు బెల్గ్రేడ్ వేదికగా ఈ ఫెయిర్ జరగనుంది. సెర్బియా పర్యాటక శాఖ మంత్రి హుస్సేన్ మీమిక్ ఈ ఆహ్వాన పత్రికను పంపారు. యూరప్, సెర్బియాలో పర్యాటక రంగం అభివృద్ధికి సంబంధించి ఇదే అతిపెద్ద కార్యక్రమం అని చెప్పవచ్చు. గత 30 ఏళ్లుగా ఈ ఫెయిర్ నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ ఏడాది జరిగే కార్యక్రమం థీమ్, ‘అడ్వెంజర్ బిగిన్స్ హీర్’ (సాహసం ఇక్కడే మొదలు) అని ఐటీఎఫ్ నిర్వాహకులు ప్రకటించారు. వివిధ దేశాల టూరిజం మంత్రులు, ఈ రంగంలో పెట్టుపడులు పెట్టే ఇన్వెస్టర్లు, భాగస్వాములు అందరూ ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో పాల్గొంటారని తెలుస్తోంది.













