సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం
బిల్కిస్ బానో రివ్యూ పిటిషన్ విషయంలో సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. 2002 వ సంత్సరంలో సామూహిక అత్యాచారం చేసి, కుటుంబ సభ్యులను హత్య చేసిన కేసులో దోషులుగా తేలిన 11 మందిని త్వరగా విడుదల చేయడాన్ని సవాల్ చేస్తూ బిల్కిస్ బానో దాఖలు చేసిన రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో 11 మంది నిందితులు 2008లో దోషులుగా తేలారు. దీంతో వారికి కోర్టు జీవితఖైదు విధించింది. ఈ కేసులో 2008లో దోషులుగా తేలిన 11 మంది వ్యక్తులు ఆగస్టు 15న గోద్రా సబ్ జైలు నుంచి బయటకి వచ్చారు. గుజరాత్ ప్రభుత్వం రిమిషన్ పాలసీ ప్రకారం వారిని విడుదల చేయడానికి కోర్టు అనుమతించింది. దీనిపై బల్కిస్ బబానో రివ్యూ పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.













