సానియా మీర్జా సంచలన ప్రకటన!
భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా సంచలన ప్రకటన చేసింది. ఈ ఏడాది సీజన్‌తో తన కెరీర్ ముగిస్తున్నట్లు ప్రకటించింది. 35 ఏళ్ల సానియా మహిళల డబుల్స్ టెన్నిస్ విభాగంలో ఎన్నో అద్భుతాలు చేసింది. భారత్‌కు మరపురాని విజయాలు అందించింది. తొలి గ్రాండ్‌స్లామ్ అందుకున్న భారతీయురాలిగా చరిత్ర సృష్టించింది. ప్రస్తుతం జరుగుతున్న ఆస్ట్రేలియన్ ఓపెన్ 2022లో సానియా జోడీ ఓటమిపాలైంది. ఈ సందర్భంగా సానియా మాట్లాడుతూ కొన్ని రోజులుగా మోకాలు, మోచేయి నొప్పితో బాధపడుతున్నా. అయితే ఆస్ట్రేలియా ఓపెన్ ఓటమికి అని కారణాలుగా చెప్పదల్చుకోలేదు. అలా అని కెరీర్‌ను పొడిగించనూలేను. ఇదే చివరి సీజన్ అని మాత్రం చెప్పగలను అని అన్నారు.
గతేడాది ఆఖర్లోనే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ ఆటను ఆస్వాదించేందుకు సిద్ధంగానే ఉన్నా. అయితే ఇపుడు నా వయసు 35. ఈ సీజన్‌ను విజయవంతంగా ముగించడమే నా ముందున్న లక్ష్యం. యూఎస్ ఓపెన్ ఆడేందుకు ప్రయత్నిస్తా. తల్లి అయిన తర్వాత ఫిట్నెస్ సాధించేందుకు చాలా కష్టపడ్డా. నాకు నేను మోటివేషన్ చేసుకునేదాన్ని. అయితే గతంలో ఉన్న ఎనర్జీ లేదనే చెప్పాలి. అలాగే గాయాల నుంచి కోలుకునేందుకు చాలా రోజుల సమయం పడుతోంది. మూడేళ్ల కుమారుడిని నాతోపాటు విదేశాలకు తీసుకెళ్లడం కూడానూ రిస్క్‌తో కూడుకున్నదే అని పేర్కొంది.
ప్రస్తుతం సానియా 68వ ర్యాంకులో ఉంది. తన కెరీర్లో అత్యుత్తమంగా డబ్బుల్ విభాగంలో ప్రపంచ నెంబర్ వన్‌గా నిలిచింది. సింగిల్స్‌లో అత్యుత్తమంగా 27వ ర్యాంకులో నిలిచింది. చివరగా 2016 ఆస్ట్రేలియా ఓపన్‌లో మార్టినా హింగిస్‌తో కలిసి టైటిల్ గెలిచింది. వీళ్లిద్దరూ మహిళల టెన్నిస్‌లో అత్యుత్తమ జోడీల్లో ఒకరిగా వెలుగొందిన విషయం తెలిసిందే.













