కేంద్ర మంత్రి జైశంకర్ కు అరుదైన అవకాశం

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఆర విడత పోలింగ్‌లో కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ అరుదైన అవకాశం దక్కించుకున్నారు. తొలి ఓటు వేసి ఎన్నికల సంఘం నుంచి ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఉదయం పోలింగ్ బూత్ తెరవకముందే ఢిల్లీలోని పోలింగ్ కేంద్రం వద్ద లైన్‌లో నిల్చున్న జైశంకర్ తొలి మేల్ ఓటు వేశారు. పోలింగ్ బూత్‌లో ఓటేసిన ఫస్ట్ మేల్ ఓటర్ కావడంతో సదరు పోలింగ్ బూత్ సిబ్బంది కేంద్ర మంత్రికి సర్టిఫికెట్ అందించారు. దానిని చూపిస్తూ జైశంకర్ ఫోటో దిగి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఓ చేతిలో ప్రౌడ్ టు బి ఫస్ట్ మేల్ ఓటర్ సర్టిఫికెట్, మరో చేతి వేలికి సిరా గుర్తును చూపిస్తూ కేంద్ర మంత్రి ట్విట్టర్‌లో ఫొటో షేర్ చేశారు. ఈ సంద్భంగా పోలింగ్ బూత్‌కు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ కేంద్ర మంత్రి ఢిల్లీ ఓటర్లకు పిలుపునిచ్చారు.