మొదలుకాబోతున్న రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సీజన్-2
ఏ23 సమర్పణలో రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్‌క రంగం సిద్ధమైంది. అన్ని జట్ల కెప్టెన్లతో పాటు టోర్నీ నిర్వహకులు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వాలీబాల్ లీగ్ మ్యాచ్‌లను ఆస్వాదించేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సందర్భంగా లీగ్ సీఈవో జాయ్ భట్టాచార్య మాట్లాడుతూ తొలి సీజన్ విజయవంతమైన నేపథ్యంలో మలి సీజన్‌పై అందరికీ మరింత ఆసక్తి నెలకొందని ఆయన పేర్కొన్నాడు.
‘విజయవంతంగా ముగిసిన తొలి సీజన్ తర్వాత రెండో సీజన్ మొదలుపెట్టడం చాలా సంతోషంగా ఉంది. ఈ లీగ్‌ను విస్తరించేందుకు మరిన్ని అవకాశాలు ఉన్నాయి. ఈసారి ముంబై మెటార్స్ కొత్తగా లీగ్‌లో ఆడబోతున్నది. దీనికి తోడు అంతర్జాతీయ వాలీబాల్ ఫెడరేషన్(ఎఫ్‌ఐవీబీ)తో కలిసి భాగస్వామ్యం ఏర్పరుచుకున్నాం. ఈసారి వరల్డ్ వాలీబాల్ క్లబ్ లీగ్ భారత్‌లో తొలిసారి జరుగబోతున్నది. పీవీఎల్‌లో విజేతగా నిలిచిన జట్టు ప్రపంచ చాంపియన్‌షిప్‌నకు అర్హత సాధిస్తుంది. ఈ సారి సీజన్లో మరింత క్వాలిటీ ఆశించవచ్చు. భారత్‌లో గతంలో ఎన్నడూ లేని విధంగా వాలీబాల్ యాక్షన్‌ను ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది’ అని భట్టాచార్య అన్నారు.
ఏ23 సమర్పిస్తున్న రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్‌ను బేస్‌లైన్ వెంచర్స్ మార్కెటింగ్‌తో పాటు ప్రమోట్ చేస్తున్నది. లీగ్‌కు వేదికలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చిలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. మార్చి 5న కొచ్చిలో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.
రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ రెండో సీజన్లో ఈనెల 4న డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా థండర్‌బోల్ట్స్, బెంగళూరు టార్పెడోస్ మధ్య తొలి మ్యాచ్ జరుగనుంది. రూపే ప్రైమ్ వాలీబాల్ లీగ్ సోనీ స్పోర్ట్స్ టెన్-1(ఇంగ్లిస్), టెన్-3(హిందీ), టెన్-4(తమిళ్, తెలుగు), టెన్-2(మళయాళం) చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం కానుంది. భారత్ బయట వాలీబాల్ వరల్డ్ టీవీలో లీగ్ ప్రసారం అవుతుంది.













