ప్రజల వద్ద డబ్బు లేకపోతే.. అది ఎలా జరుగుతుంది ?
దేశంలో వైద్య, విద్యా సౌకర్యాలను మెరుగుపర్చాలని కేంద్ర భావిస్తే వారితో కలిసి పనిచేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఉచిత పథకాలు ప్రమాదకరమంటూ ప్రధాని మోదీ ప్రస్తావించిన నేపథ్యంలో కేజ్రీవాల్ మరోసారి స్పందించారు. ఉచిత విద్య, వైద్యం పథకాలను ఉచితాలుగా పరిగణించకూడదని కేంద్ర ప్రభుత్వానికి మరోసారి సూచించారు. పేదలకు మంచి విద్య అందకుంటే వారు పేదలుగానే మిగిలిపోతారని, దేశం ధనికంగా మారదన్నారు. దేశంలో ప్రతి చిన్నారికి మంచి ఉచిత విద్యా అందాలి. ప్రతి వ్యక్తి ఆరోగ్య సంరోణ కోసం ఉచిత వైద్యం అందాలి. ఈ అంశాలపై ఇప్పటినుంచే యుద్ధ ప్రాతిపదికన పనిచేయాలి. అప్పుడే దేశం అగ్రస్థానంలో నిలుస్తుంది అని అన్నారు. భారత్‌ను ప్రపంచంలోనే శక్తిమంతమైన దేశంగా చూడాలన్నదే తన కోరిక అని అన్నారు. ప్రతి భారతీయుడు ధనవంతుడిగా మారినప్పుడే భారత్ ధనిక దేశంగా మారుతుంది. ప్రజల వద్ద డబ్బు లేకపోతే అది ఎలా జరుగుతుంది అని అన్నారు.













