రతన్ టాటాకు మరో అరుదైన గౌరవం
టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటాను మరో అవార్డు వరంచింది. మహారాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఉద్యోగ రత్న అవార్డును ఆయన దక్కించుకున్నారు. తమ సరికొత్త అవార్డుతో ఆయనను సత్కరించాలని మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి ఉదయ్ సమంత్ ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ ఏడాది నుంచి ప్రతిష్టాత్మకమైన ఉద్యోగ రత్న అవార్డును ప్రవేశపెట్టేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్లు పాల్గొన్న సమావేశంలో ఈ ఏడాది పారిశ్రామికవేత్తకు తొలి ఉద్యోగ రత్న అవార్డును రతన్ టాటాను ఎంపిక చేశారు.













