రతన్ టాటాకు సేవా రత్న అవార్డు
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అనుబంధ సంస్థ అయిన సేవా భారతి సేవా రత్న అవార్డును అందజేసింది. టాటా సంస్థల మాజీ చైర్మన్ రతన్ టాటా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన చలసాని బాబూ రాజేంద్రప్రసాద్‌తో పాటు మరో 24 మంది వ్యక్తులు, సంస్థలకు కూడా ఈ పురస్కారాలు అందజేసింది. ఉత్తరాఖండ్ గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మిత్ సింగ్ (రిటైర్డ్) చేతులమీదుగా జరిగిన ఈ కార్యక్రమానికి రతన్ టాటా హాజరుకాలేదని ఆ సంస్థ పేర్కొంది. తమ దాతృత్వంతో సమాజానికి వెలకట్టలేని సేవలందించిన వారికి గుర్తింపుగా ఈ పురస్కారాలను అందిస్తామని వెల్లడించింది.













