రతన్ టాటాకు పీ.వీ స్మారక అవార్డు
పీ.వీ. నరసింహారావు మెమోరియల్ అవార్డును ప్రముఖ పారిశ్రామిక వేత్త, టాటా గ్రూప్ అధినేత రతన్ టాటా అందుకున్నారు. పీ.వీ నరసింహా రావు స్మారక ఫౌండేసన్ ప్రధాన కార్యదర్శి మాడంచెట్టి అనిల్ కుమార్, పీవీ మనుమడు, వ్యాపార వేత్త కశ్వప్ ముంబైలోని రతన్ టాటా ఇంటికి వెళ్లి ఆయనకు పురస్కారాన్ని బహుకరించారు. నరసింహారావు లాంటి గొప్ప వ్యక్తి పేరిట అవార్డు దక్కడం గర్వకారణమని రతన్ టాటా ఈ సందర్భంగా అన్నారు. పీవీ స్ఫూర్తితో దేశ నిర్మాణం కోసం యువత కృషి చేయాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాంకేతిక వేత్త హనుమాన్ చౌదరి, టాటా ట్రస్ట్ జనరల్ మేనేజర్ శంతను నాయుడు పాల్గొన్నారు.













