అయోధ్య రాముడికి వినూత్న కానుకలు!
రాముడు హిందువులకు ఆరాధ్యుడు. తమ భక్తి ప్రపత్తుల్ని చాటుకునేందుకు తహతహలాడటం రాములోరి భక్తులకు అలవాటే. అయోధ్యలో ఈ నెల 22న రామలల్లా విగ్రహాన్ని ప్రతిష్టించబోతున్న తరుణంలో భక్తులు వినూత్న కానులకు పంపిస్తున్నారు. ఇప్పటికే భారీ బంగారు తాళం చెవి, 108 అడుగుల పొడవు, 3.5 అడుగుల మందం కలిగిన అగర్బత్తి, బంగారు ఢంకా, హనుమత్సమేత సీతారామచంద్ర భరతశత్రుఘ్నుల బంగారు ప్రతిమ, ఇప్పుడు భారీ బంగారు నగారా, 500 వజ్రవైఢూర్యాల నగలు, 500 కేజీల బరువైన గంట ఇలా ఒకటేమిటి.. భక్తుల ఆరాధనకు ఆలంబనగా ఈ వినూత్న బహుమతులు అయోధ్యకు చేరుకున్నాయి. వడోదరలోని నాగర్కు చెందిన 25 మంది వృత్తి పని వారు 3 నెలలపాటు రాత్రీ పగలూ విశ్రాంతి లేకుండా పనిచేసి 56 అంగుళాల వెడల్పున్న నగారాను బంగారు, వెండితో చేసి అయోధ్యకు పంపారు. దీనిని ఆలయం దిగువ అంతస్థులో ప్రవేశ ద్వారం వద్ద పెట్టనున్నారు.













