మిస్ ఎర్త్ ఇండియా గా ప్రియన్ సైన్
రాజస్థాన్‌కు చెందిన ప్రియన్ సైన్(20) మిస్ ఎర్త్ ఇండియా 2023గా ఎంపికైంది. దీని ద్వారా డిసెంబర్లో వియత్నాంలో జరగనున్న అంతర్జాతీయ అందాల పోటీల్లో మిస్ ఎర్త్‌గా భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది. డివైన్ బ్యూటీ పేరుతో జరిగే ఈ ఈవెంట్లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా, మిస్ ఎర్త్ ఇండియా అవార్డులను అందజేస్తారు. మిస్ రాజస్థాన్ 2022 అందాల పోటీలో ప్రియన్ సైన్ మొదట రన్నరప్‌గా నిలిచి గుర్తింపు పొందింది. తాజాగా ఈ ఈవెంట్ ఢల్లీిలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో మిస్ ఎర్త్ ఇండియా ఈవెంట్ జరిగింది. దీనిని దీపక్ అగర్వాల్ డివైన్ బ్యూటీ వారు ఈ పోటీని నిర్వహించారు.
16 మంది ఫైనలిస్టులలో ప్రియన్ సైన్ ఒకరు. అనేక పోటీల్లో గెలుపొందిన ఆమె ఇప్పుడు మిస్త్ ఎర్త్ ఇండియా 2023గా అవతరించింది. విజేతగా ప్రకటించిన వెంటనే ప్రియన్ సైన్ భావోద్వేగానికి గురయ్యారు. మిస్ రాజస్థాన్ 2022లో ప్రియన్ మొదటి రన్నరప్‌గా నిలిచిందని మిస్ రాజస్థాన్ నిర్వహకులు, ప్రియన్ సైన్ మెంటార్ యోగేష్ మిశ్రా, నిమిషా మిశ్రా తెలిపారు. మెడిసిన్ చదువుతూనే ప్రియన్ సైన్ మిస్ ఇండియాకు కూడా సిద్ధమవుతోంది. ప్రియన్ తల్లి రాజస్థాన్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. ప్రియన్‌కు తల్లి మాత్రమే ఉంది.













