రాహుల్ గాంధీకి ఆయుర్వేద వైద్యం… ఎందుకో తెలుసా?
కాంగ్రెస్ సీనియర్ నాయుడు రాహుల్ గాంధీ కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నారు. మళప్పురం జిల్లాలోని కొట్టక్కల్లోని ఆర్య వైద్యశాలలో చికిత్స ప్రారంభించినట్లు తెలుస్తోంది. జులై 29 వరకు మరో వారం రోజుల పాటు ఆయన ఇక్కడే ఉండనున్నట్లు సమాచారం. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆయనకు తోడుగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రస్టీ మేనేజింగ్ డైరెక్టర్ మాదవన్ కుట్టీ వారియర్ సమక్షంలో చికిత్స కొనసాగనుంది. అయితే రాహుల్ దేనికి చికిత్స తీసుకుంటున్నారనే విషయం పూర్తిగా తెలియదు. 116 ఏళ్ల చరిత్ర కలిగిన కొట్టక్కల్ ఆర్య వైద్యశాల ఆయుర్వేద చికిత్సలో దేశానికి సేవ చేస్తోంది. విదేశాల నుంచి వచ్చిన రోగులకు సైతం వైద్య చికిత్సలు అందిస్తున్నారు.













