వచ్చే వారం భారత్‌కు రాఫెల్స్
ఫ్రాన్స్ నుంచి రావాల్సిన రాఫెల్ యుద్ధ విమానాలను తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. మరో మూడు రాఫెల్ ఫైటర్ జెట్లు రాబోయే నాలుగు రోజుల్లో భారత్‌కు రానున్నాయి. వీటి రాకతో భారత వైమానిక దళం మరింత పటిష్టం కానుంది. ఆ తర్వాత మరో తొమ్మిది యుద్ధ విమానాలు ఏప్రిల్ మధ్య నాటికి ఫ్రాన్స్ నుంచి నేరుగా భారత్‌కు చేరుకుంటాయని రక్షణ వర్గాలు తెలిపాయి. మూడు రాఫెల్ యుద్ధ విమానాలు తీసుకువచ్చేందుకు భారత వైమానిక బృందం ఇప్పటికే ఫ్రాన్స్ చేరుకుంది. ఫైటర్ జెట్లు ఈ నెల 30 లేదంటే 31న ఫ్రాన్స్ నేరుగా అంబాలా ఏర్బెస్కు చేరుకుంటాయి. ఇండియా మొత్తంగా ఫ్రాన్స్ నుంచి 36 రఫేల్ జెట్లను రూ.59 వేల కోట్లకు ఆర్డర్ చేసింది. వీటిల్లో అంబాలా బేస్డ్ గోల్డెన్ యారోస్ స్క్వాడ్రన్‌లో 11 రఫేల్ జెట్స్‌ను ఉంచారు. వీటిని లడఖ్‌లో ఆపరేట్ చేస్తున్నారు.













