ప్రధాని మోదీతో ఎమ్మెల్సీ వాణీదేవి భేటీ

హైదరాబాద్ నగర పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీని వావిలాలా ఖాదీ గ్రామోద్యోగ్ ప్రతిష్టాన్ చైర్‌పర్సన్, ఎమ్మెల్సీ వాణీదేవి మర్యాదపూర్వకంగా కలిశారు. మాజీ ప్రధాన మంత్రి పీవీ నరసింహారావుకు భారతరత్న పురస్కారాన్ని అందజేసినందుకు ఆమె కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం వావివాల ఖాదీ కండువాతో ప్రధానిని సత్కరించారు. తాను రచించిన పుస్తకాలను ఆయనకు వాణీదేవి అందజేశారు.