18 నుంచి పుణే-నాగపూర్ విమాన సర్వీసు
ఈ నెల 18న షిరిడీ విమానాశ్రయం నుంచి పూణే-నాగపూర్ సర్వీస్ ప్రారంభం కానుంది. ఈ మేరకు షిరిడీ ఎయిర్ పోర్టు డైరెక్టర్ సుశీల్ కుమార్ తెలిపారు. నాగపూర్ నుంచి పూణే విమాన సర్వీస్ ప్రారంభించామని ప్రజల నుండి డిమాండ్ వస్తున్న నేపథ్యంలో ఈ సర్వీస్ ప్రారంభిస్తున్నట్లు ఆయన తెలిపారు. కరోనా కారణంగా ఇన్నాళ్ళు విమానాశ్రయాన్ని మూసివేయడం జరిగిందన్నారు. ఇప్పుడు షిరిడీ నుంచి విమాన సర్వీసులు సజావుగా నడుస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం షిరిడీ నుంచి హైదరాబాద్కు రెండు సర్వీసులు, బెంగళూరుకు రెండు సర్వీసులు, ఢిల్లీ, చెన్నైలకు ఒక్కోక్క సర్వీసులు నడుపుతున్నట్లు తెలిపారు.













