ప్రియాంక గాంధీకి అస్వస్థత.. ఆసుపత్రిలో చేరిక
కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరినట్లు ఆమె వెల్లడించారు. ఉత్తరప్రదేశ్లో జరగబోయే భారత్ జోడో న్యాయ యాత్ర కోసం ఎంతగానో ఎదురుచూశాం. కానీ ఈరోజే అనారోగ్యం వల్ల ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. కోలుకున్న వెంటనే నేను యాత్రలో పాల్గొంటా అని తెలిపారు. మణిపుర్ నుంచి ముంబయి వరకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టన భారత్ జోడో న్యాయ యాత్ర కొనసాగుతోంది. ప్రస్తుతం బిహార్లో ఉన్న ఈ యాత్ర శుక్రవారం రాత్రికి ఉత్తరప్రదేశ్ చేరనుంది. యాపీలో రాహుల్లో కలిసి ప్రియాంక కూడా పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ ఇదివరకే ప్రకటించింది. ఇప్పుడు ఆమె అనారోగ్యానికి గురువడంతో యాత్రలో పాల్గొనలేకపోతున్నట్లు తెలిపారు.













