ఎంపీలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విందు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము వివిధ రాష్ట్రాల ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. రాష్ట్రపతి భవన్లో కల్చరల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ, తమిళనాడు, గోవా, ఒడిశా, ఢిల్లీ, పుదుచ్చేరి, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, దాద్రానగర్ హలేలి, దమన్ దీవూ ఎంపీలను ఆహ్వానించారు. విందులో తెలంగాణ నుంచి బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేశవరావవు, లోక్‌సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు బడుగుల లింగయ్య యాదవ్, రాములు, బీబీ పాటిల్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, బండి పార్థసారథిరెడ్డి, కాంగ్రెస్ ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పాల్గొన్నారు.













