ఘనంగా సంగీత నాటక అకాడమీ అవార్డుల ప్రదానం
భారతదేశం కళలకు పుట్టినిల్లు అని, కళలు సామాజిక ప్రయోజనానికి ఎంతో దోహదపడతాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో ఆమె 2022, 2023 సంవత్సరాలకు సంబంధించిన సంగీత నాటక అకాడమీ అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ముర్ము మాట్లాడుతూ ఏడు దశాబ్దాలుగా కళలను ప్రోత్సహిస్తున్న అకాడమీని ఆమె అభినందించారు. కళాకారులు కళలతో ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. తెలంగాణకు చెందిన ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారులు రాధా రెడ్డి-రాజా రెడ్డి దంపతులకు ప్రతిష్ఠాత్మక సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్‌ను ముర్ము అందజేశారు. ఈ ఫెలోషిప్‌లో భాగంగా వారికి రూ. 3 లక్షల నగదు పురస్కారం అందజేశారు. సంగీతం, నృత్యం, రంగస్థలం, సంప్రదాయ, జానపద, గిరిజన సంగీత, నృత్య కళలల్లో మొత్తం 92 మంది సంగీత నాటక అకాడమీ అవార్డులు వచ్చాయి. మరో 80 మది యువకళాకారులకు 2022, 23 సంవత్సరాలకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కారాలు దక్కాయి.













