పార్లమెంట్ నూతన భవనాన్ని సందర్శించిన ప్రధాని మోదీ
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ నూతన భవనాన్ని ఆకస్మికంగా సందర్శించారు. ప్రధాని మోదీ అక్కడ వివిధ విభాగాలు కొనసాగుతున్న పలు పనులను తనికీ చేశారు. నిర్మాణంలో పాల్గొంటున్న సిబ్బందితో మాట్లాడారు. పార్లమెంట్లోని ఉభయసభల్లో కల్పించే వివిధ సదుపాయాలను ఆయన పరిశీంచారు. అత్యాధునిక హంగులతో రూపుదిద్దుకుంటున్న పార్లమెంట్ భవనానికి ప్రధాని మోదీ 2020 డిసెంబరులో శంకుస్థాపన చేశారు. గత నంబవర్కే ఇది పూర్తి కావాల్సి ఉండగా వివిధ కారణాలతో ఆలస్యమైంది. దీనిని మరికొద్ది రోజుల్లో ప్రారంభించే అవకాశాలున్నాయి.













