జీ20 అతిథులకు ఇచ్చిన బహుమతులు.. ఇవే
జీ20 సదస్సుకు వచ్చిన అతిథులకు భారతీయ కళాకారులు స్వహస్తాలతో రూపొందించిన వస్తువులతో పాటు సంప్రదాయాలకు సంబంధించిన వాటిని బహుమతులుగా అందించింది భారత్. బహుమతుల గుచ్చంలో కశ్మీరీ కుంకుమ పువ్వు, ఇత్తడి అంచుతో కూడిన రోజ్ వుడ్ చెక్క్ పెట్టెలు, దార్జీలింగ్, నీలగిరి టీ, అరకు కాఫీ, కశ్మీరి శాలువాలు, సుందర్బన్స్లో దొరికే తేనె. జిగ్రానా అత్తర్ ( కన్నౌజ్) ఉన్నాయి. ఖాదీ కండువా, జీ20 దేశాలకు గుర్తుగా చేసిన నాణేలతో కూడిన బాక్సు అతిథులకు ఇచ్చారు. దేశాధినేతల సతీమణులకు భారతీయ సంప్రదాయ వస్తువులను బహుమతులుగా అందజేశారు.













