ప్రధాని మోదీ ఏరియల్ సర్వే…

గుజరాత్ రాష్ట్రంలో తౌక్టే తుఫాన్ భారీ నష్టాన్ని మిగిల్చింది. అతి భీకరంగా విరుచుకుపడ్డ తుఫాన్‍తో భారీ ఆస్థి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ గుజరాత్‍లో ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించారు. ఉనా, డయూ, జఫరాబాద్, మహువా ప్రాంతాల్లో ఆయన సర్వే నిర్వహించారు. ప్రభావానికి గురైన ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. మ్యాప్‍లను, శాటిలైట్ ఇమేజ్‍లను ఆయన పరిశీలించారు. గుజరాత్‍లోని కోస్టల్ జిల్లాలను ఆయన సర్వేలో పరిశీలించారు. ఎంత నష్టపరిహారం ఇవ్వాలన్న దానిపై త్వరలో ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయి. తౌక్టే తుపాన్ కారణంగా గుజరాత్‍లో 13 మంది మరణించిన సంగతి విదితమే.