ప్రపంచ నేతల్లో మళ్లీ మోదీయే టాప్
అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుల జాబితాలో భారత ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు. గ్లోబల్ డెసిషన్ ఇంటెలిజెన్స్ కంపెనీ మార్నింగ్ కన్సల్ట్ తాజాగా నిర్వహించిన సర్వేలో ప్రధాని మోదీ 75 శాతం రేటింగ్‌తో టాప్‌లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ కలిగిన నాయకులపై మార్నింగ్ కన్సల్డ్ ఈ ఏడాది ఆగస్టు 17 నుంచి 23 మధ్య ఒక సర్వే నిర్వహించింది. ఈ క్రమంలో ప్రధాని మోదీ బారత్‌ను సరైన దిశలో నడిపిస్తున్నారని సుమారు 72 శాతం మందికి పైగా భారతీయులు విశ్వసిస్తున్నారని, కొవిడ్ సెకండ్‌వేవ్ సమయంలోనూ ఆయన నాయకత్వంపై ఇలాంటి నమ్మకమే ఉందని ఈ సర్వే వెల్లడించింది.
ప్రధాని మోదీ తర్వాత అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రపంచ నాయకుల్లో మెక్సికో అధ్యక్షుడు ఆండ్రీస్ మాన్యుయెల్ లోపెజ్ ఒబ్రడోర్ 63 శాతం రేటింగ్‌తో రెండో స్థానంలో నిలవగా, ఆస్ట్రేలియా ప్రధాని ఆంటోనీ అల్ఫాబెస్ 58 శాతం రేటింగ్‌తో తృతీయ స్థానం దక్కించుకున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైబైడెన్ 41 శాతం రేటింగ్‌తో తొమ్మిదో స్థానం, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో 39 శాతం రేటింగ్‌తో పదో స్థానంలో సరిపెట్టుకున్నారు.













