దేశంలోనే అతి పొడవైన తీగల వంతెన ప్రారంభం
దేశంలో అతి పొడవైన తీగత వంతెన సుదర్శన్ సేతు ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని బెట్ ద్వారక ద్వీపాన్ని కలిపే ఈ వంతెనను ప్రధాని మోదీ ప్రారంభించారు. దీని పొడవు 2.32 కిలోమీటర్లు. రూ.979 కోట్ల వ్యయంతో దీనిని నిర్మించారు. 27.20 మీటర్ల వెడల్పుతో నాలుగు వరుసలతో నిర్మించిన ఈ వంతెనపై 2.50 మీటర్ల వెడల్పైన నడకమార్గం కూడా ఉంది. ఈ రెండు ప్రాంతాల మధ్య ఇంతవరకు నాటుపడవలే ఆధారంగా ఉండేవి. కొత్త వంతెనపై పలుచోట్ల సౌరఫలకాలు ఏర్పాటు చేసి ఒక మెగావాట్ విద్యుతుత్పత్తి చేయనున్నారు.













