వారిద్దరూ మిస్సింగ్ : కాంగ్రెస్ ఆరోపణ

ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి కనిపించడం లేదని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలో వ్యాక్సిన్లతో పాటు ప్రధాని మోదీ కూడా కనిపించడం లేదని రాహుల్ చురకలంటించారు. కరోనా ఇంత ఉధృతంగా సాగుతున్నా, ప్రధాని మోదీ ఉలుకూ పలుకూ లేకుండా పోయారని విమర్శించారు. వ్యాక్సిన్, ఆక్సిజన్, ఔషధాలతో పాటు ప్రధాని కూడా కనిపించడం లేదని, కేవలం సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, అక్కడా ఇక్కడా ప్రధాని మోదీ ఫొటోలు మాత్రమే కనిపిస్తున్నాయని ట్విట్టర్ వేదికగా రాహుల్ విరుచుకుపడ్డారు.
అమిత్‌షా కనిపించడం లేదు : ఎన్‌ఎస్‌యూఐ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పైన కూడా కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ ఇదే రకమైన ఆరోపణలు చేసింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మిస్సింగ్ అన్న యాష్‌ట్యాగ్‌తో 500 కు పైగా ట్వీట్లు సోషల్ మీడియాలో వచ్చాయి. దేశం కరోనాతో పోరాడుతుంటే హోమంత్రి మిస్సింగ్ ఇన్ యాక్షన్ అని ట్వీట్లు మార్మోగాయి. మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ విద్యార్థి సంఘం పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. ఇంతటి క్లిష్ట సమయంలో అమిత్‌షా కనిపించడం లేదని ఎన్‌ఎస్‌యూఐ జాతీయ కార్యదర్శి నగేశ్ కరియప్ప ఫిర్యాదు చేశారు. సంక్షోభ సమయంలో ప్రజానీకానికి సేవల చేయాలి కానీ, కనిపించకుండా పోవద్దని పేర్కొన్నారు.