ప్లాస్మా థెరపీతో లాభం లేదు : ఐసీఎంఆర్
కరోనా మరణాల రేటును తగ్గించడంలో ప్లాస్మా థెరపీ ప్రయోజనం తక్కువేనని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) అధ్యయనంలో తేలింది. కొవిడ్ 19 తీవ్రరూపం దాల్చకుండా అడ్డుకోవడంలోనూ ఈ చికిత్సా విధానం ప్రయోజనం చూపడం లేదని వెల్లడించింది. దేశవ్యాప్తంగా 29 కొవిడ్ చికిత్సా కేంద్రాల్లో 464 మందిపై అధ్యయనం జరిపిన అనంతరం ఈ విషయాలు వెల్లడించింది. ఏప్రిల్ 22 నుంచి జులై 14 మధ్య ఈ పరిశోధన చేపట్టినట్లు తెలిపింది. పరిమిత వసతులుండే సాధారణ ప్రయోగశాలల్లో ఈ థెరపీని చేపట్టడం సాధ్యం కాదని తెలిపింది. చికిత్సకు ముందు దాత, రోగిలో యాంటీబాడీల సంఖ్యను లెక్కించడం వల్ల ఈ థెరపీ ప్రయోజనంపై సృష్టత లభించే అవకాశం ఉందని అధ్యయనం పేర్కొంది.













