కేరళ సీఎంగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం

కేరళ ముఖ్యమంత్రిగా పినరయి విజయన్ ప్రమాణ స్వీకారం చేశారు. తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో గవర్నర్ ఆరిఫ్ మహ్మద్‍ఖాన్ విజయన్ చేత రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రయాణం చేయించారు. కాగా విజయన్‍తో పాటు 11 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే గత ప్రభుత్వంలోని ఒక్కరికీ ఈసారి కేబినెట్‍లో అవకాశం కల్పించలేదు. అందర్నీ కొత్తవారినే తీసుకున్నారు. కేరళలో మొత్తం 140 అసెంబ్లీ స్థానాలకుగానూ అధికార ఎల్‍డీఎఫ్ 99 స్థానాల్లో విజయం సాధించి వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 41 స్థానాలకు పరిమితమైంది. బీజేపీ మాత్రం బోణీ కొట్టలేకపోయింది. ఉన్న ఒక్కస్థానాన్నీ కోల్పోయింది.