షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే.. నిరవధిక వాయిదా
లోక్సభ నిరవధిక వాయిదాపడింది. షెడ్యూల్ కంటే ఒక రోజు ముందుగానే సభ ముగిసింది. పార్లమెంట్ శీతాకాల సమావేశాలు డిసెంబర్ 4న ప్రారంభమైన విషయం తెలిసిందే. సభలో ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ పీరియాడికల్స్ బిల్లు-2023, సీఈసీ నియామకాల బిల్లుకు లోక్సభ మూజువాణీ ఓటుతో ఆమోదం తెలిపింది. అనంతరం సభను స్పీకర్ ఓం బిర్లా నిరవధిక వాయిదా వేశారు. అయితే ఈ నెల 13న పార్లమెంట్లో జరిగిన భద్రతా వైఫల్యం ఘటన వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రతిపక్ష పార్టీలు ఘటనపై ఆందోళన వ్యక్తం చేశాయి. సెక్యూరిటీ వైఫల్యం పై ప్రధాని నరేంద్ర మోదీతో పాటు హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ఉభయ సభల్లో నిరసన తెలిపాయి.













