పార్లమెంట్ లో ఒకే రోజు .. 78మంది ఎంపీలపై
పార్లమెంట్లో గతవారం చోటు చేసుకున్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. విపక్షాల నిరసనలతో లోక్సభ, రాజ్యసభల్లో కార్యకలాపాలు స్తంభించాయి. మరోవైపు, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నందుకు గానూ ఒక్క రోజే 70 మందికి పైగా విపక్ష ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడటం గమనార్హం. లోక్సభలో 33 మంది, రాజ్యసభలో 45 మంది ఎంపీలు సస్పెండ్ చేశారు. కాంగ్రెస్ సభాపక్ష నేత అధిర్ రంజన్ చౌదరి సహా 33 మందిని సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు లోక్సభ స్పీకర్ ప్రకటించారు. వీరిలో 30 మందిని ఈ శీతాకాల సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా, మరో ముగ్గురిని ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తెలిపారు. ఎంపీలు కె.జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలీఖ్ స్పీకర్ పోడియం వద్ద నినాదాలు చేశారు. వీరి ప్రవర్తనపై ప్రివిలేజెస్ కమిటీ నివేదిక ఇవ్వనుంది.













