పన్నీర్ సెల్వంకు భారీ షాక్.. పళని ఏకగ్రీవంగా ఎన్నిక
తమిళనాట దశాబ్దాల చరిత్ర కలిగిన అన్నాడీఎంకే పార్టీ పగ్గాలను మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి పూర్తిస్థాయిలో అందుకున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తనను పార్టీ నుంచి బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ మాజీ సీఎం ఓ పన్నీర్ సెల్వం వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసిన కొద్దిసేపటికే పళని ఎన్నికపై అధికారిక ప్రకటన రావడం గమనార్హం. అన్నాడీఎంకే లో ద్వంద్వ నాయకత్వాన్ని రద్దు చేసి పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళనిస్వామి బాద్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రధాన కార్యదర్శి పదవికి మార్చి 26న ఎన్నికలు నిర్వహించారు. ఈ పదవికి పళని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పార్టీ అధికారికంగా ప్రకటించింది. అధినాయకత్వ పోరులో కోర్టుకెళ్లిన పన్నీర్ సెల్వం పిటిషన్నను న్యాయస్థానం కొట్టేసిన కొద్దిసేపటికే పార్టీ ఈ ప్రకటన చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.













