శ్రీలంకపై థ్రిల్లింగ్ విక్టరీ.. చరిత్ర సృష్టించిన పాక్
వన్డే వరల్డ్ కప్‌లో పాకిస్తాన్ టీం చరిత్ర సృష్టించింది. హైదరాబాద్ వేదికగా జరిగిన శ్రీలంకతో జరిగిన మ్యాచులో రికార్డులు బద్దలు కొట్టింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 344 పరుగుల భారీ స్కోరు చేసింది. కుశాల్ మెండిస్ (122), సదీర సమరవిక్రమ (108) శతకాలతో రాణించారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో పాకిస్తాన్‌కు అనుకున్న ఆరంభం దక్కలేదు. ఇమామ్ ఉల్ హక్ (12), బాబర్ ఆజమ్ (10) విఫలమయ్యారు. ఇలాంటి సమయంలో మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (113), మహమ్మద్ రిజ్వాన్ (131 నాటౌట్) ఆ టీంను ఆదుకున్నారు. ఆ తర్వాత షఫీక్ అవుటైనా సౌద్ షకీల్ (31), ఇఫ్తికర్ అహ్మద్ (22 నాటౌట్)తో కలిసి రిజ్వాన్ లాంఛనం పూర్తి చేశాడు. అతని భారీ ఇన్నింగ్స్‌తో 48.2 ఓవర్లలోనే పాక్ ఈ మ్యాచ్ గెలిచింది. రిజ్వాన్‌కే ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇది వరల్డ్ కప్ చరిత్రలోనే అతి భారీ ఛేజ్ కావడం గమనార్హం.













