బీహార్ సీఎంగా నితీశ్ కుమార్ ప్రమాణ స్వీకారం
బీహార్లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎనిమిదోసారి నితీశ్ కుమార్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ ఫగు చౌహాన్ నితీశ్ కమార్తో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రమాణం చేశారు. బీజేపీ, జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ) సంకీర్ణ ప్రభుత్వాన్ని రద్దు చేసి, ఆయన ముఖ్యమంత్రిగా రాజీనామా చేశారు. ఆ తర్వాత ఆర్జేడీ, కాంగ్రెస్ వామపక్ష పార్టీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమానికి తేజస్వీ సతీమణి, తల్లి రబ్దీదేవి, సోదరుడు తేజ ప్రతాప్ తదితరులు హాజరయ్యారు.













