దాన్ని అంతం చేయడం.. అందరి బాధ్యత
వరకట్న వ్యవస్థ ప్రస్తుత సమాజంలో సరైంది కాదు అని, దాన్ని అంత చేయడం అందరి బాధ్యత అని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెళ్లి కోసం వరకట్నం తీసుకోవడం వ్యర్థమని స్పష్టం చేశారు. ఓ మహిళలను పురుషుడు పెళ్లి చేసుకుంటేనే సంతానం కలుగుతుందని, ఒకవేళ ఓ మగాడు మరో మగాడిని పెళ్లి చేసుకుంటే అప్పుడు సంతానం ఏమవుతుందని ప్రశ్నించారు. గతంలోనూ వరకట్న వ్యవస్థను ఓ సామాజిక భూతంగా వర్ణించారు. ప్రతి ఒక్కరు అభివృద్ధి కోసం అందరూ ఈ వ్యవస్థను రూపుమాపాలన్నారు. పెళ్లి పత్రికలపై కట్నం తీసుకోవడం లేదని రాసిన పెండ్లీకు హాజరవుతున్నట్లు తెలిపారు.













