కేంద్ర మంత్రి గడ్కరీ సంచలన వ్యాఖ్యలు… రాజకీయాలను
ఈ రోజుల్లో రాజకీయాలు అంటే అధికారం కోసమే అన్నట్లుగా మారాయని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. నాగ్‌పూర్‌లో ఎన్సీపీ మాజీ ఎమ్మెల్సీ గిరీశ్ గాంధీకి జరిగిన సన్మాన సభలో గడ్కరీ పాల్గొన్నారు. ఈ సందర్భగా గడ్కరీ మాట్లాడుతూ ఈ రాజకీయాలను వీడాలని తనకు తరచూ అనిపిస్తోందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. వీటికంటే మన జీవితంలో ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయని అన్నారు. రాజకీయాలు సామాజిక మార్పు కోసమే తప్ప అధికారమే పరమావధిగా ఉండరాదని ఆయన సూచించారు. రాజకీయాలనేవి సామాజిక, ఆర్థిక సంస్కరణలకు మార్గం కావాలి తప్ప అధికారం కోసం వెంపర్లాడటమే అంతిమ లక్ష్యం కారాదని సూచించారు. రాజకీయాలు సమాజ అభివృద్ధి కోసం మార్గం కావాలన్నారు. విద్యాభివృద్ధి కోసం కళల అభివృద్ధి కోసం పాటుపడాలన్నారు.













