సుప్రీంకోర్టు కొత్త జడ్జీల ప్రమాణ స్వీకారం
సుప్రీంకోర్టు నూతన న్యాయమూర్తులుగా జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీప్‌ా, జస్టిస్ సందీప్ మెహతాలు పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ వీరిచేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ సతీష్‌చంద్ర శర్మ, రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్న జస్టిస్ ఆగస్టీన్ జార్జ్ మసీప్‌ా, గువాహటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతల్లో ఉన్న జస్టిస్ సందీప్ మెహతాలను సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలని సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని కొలీజియం ఈ నెల 6న సిఫార్సు చేసింది. కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిశీలించి రాష్ట్రపతికి పంపగా ఆమె వీరి నియమకానికి ఆమోద ముద్ర వేశారు. దాంతో కేంద్ర న్యాయశాఖ నియామక ఉత్తర్వులు జారీ చేసింది.













