ఆ దేశాలకు విమానాలను నిలిపేయండి…
భారత్ నుంచి ఆయా దేశాలకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని ప్రధాని నరేంద్ర మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ విజ్ఞప్తి చేశారు. ఆఫ్రికా ఖండంలోని దక్షిణాది దేశాల్లో కొత్త రకం కరోనా మహమ్మారి ఒమిక్రాన్ విజృంభిస్తున్న నేపథ్యంలో కేజ్రీవాల్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కొత్త వేరియంట్ ప్రభావిత దేశాలకు విమానాల రాకపోకలను నిలిపివేయాలని ప్రధానమంత్రిని కోరుతున్నా అని అన్నారు. మనం ఎన్నో కష్టాలు పడి కరోనా బారి నుంచి కోలుకున్నాం. కాబట్టి ఈ కొత్త వేరియంట్ దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకోవడానికి మనం అందివచ్చిన ప్రతి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అని అన్నారు.













