ఏపీ విద్యార్థికి రూ. 1.2 కోట్ల ప్యాకేజీతో కొలువు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన ఈగ వెంకటసాయికృష్ణారెడ్డి ఇటీవల ఖరగ్పూర్ ఐఐటీలో జరిగిన ప్రాంగణ ఎంపికల్లో ఏడాదికి రూ. 1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం సాధించారు. ఇతడు చిన్నకారు రైతు మురళీమనోహర్ రెడ్డి`లక్ష్మీదేవి దంపతుల కుమారుడు. సాయికృష్ణారెడ్డి ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉత్తమ మార్కులు పొందారు. ఖరగ్పూర్ ఐఐటీలో ఈసీఈ చదివి 92 శాతం మార్కులు పొందారు. నాలుగో ఏడాదిలో ఉండగానే ఇంటెల్ సంస్థలో కొలువు సాధించారు.













