కేజ్రీవాల్ సతీమణి … సంచలన ప్రకటన
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ సమయంలో ఆయన సతీమణి సునీత సంచలన ప్రకటన చేశారు. లిక్కర్ స్కామ్లో నిజానిజాలను తన భర్త మార్చి 28 కోర్టులో బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. నా భర్తను అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఆయనకు ఆరోగ్యం సరిగా లేదు. డయాబెటిస్తో బాధపడుతున్నారు. కస్టడీలోనూ ఆయన ప్రజల గురించి ఆలోచిస్తున్నారు. అక్కడి నుంచే నీటి సమస్యను నివారించాలని రెండు రోజుల క్రితం మంత్రి ఆతిశీకి లేక పంపారు. దీన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సమస్యగా మారుస్తోంది. ఆయనపై కేసులు పెడుతోంది. ఢిల్లీని నాశనం చేయాలని వారు (కేంద్రం) కోరుకుంటున్నారు. ఈ పరిణామాలతో ఆయన ఆందోళనకు గురువుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.













