మరో అద్భుతం పట్టు వస్త్రంపై.. ప్రధాని
గతంలో తన డిజైనింగ్ ద్వారా ఎన్నో పట్టు వస్త్రాలు సృష్టించిన డిజైనర్ నాగరాజు మరో అద్భుతాన్ని ఆవిష్కరించారు. సుమారు నెల రోజుల పాటు నలుగురు చేనేత కార్మికులు కష్టపడి 15 వేల రూపాయల వ్యయంతో ఖాది ఇండియా వారి ఆర్డర్ మేరకు డిజైనర్ నాగరాజు ధ్యాన ముద్రలో ఉన్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ పట్టు వస్త్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఖాదీ ఇండియా కార్యాలయ కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఈ పట్టు వస్త్రం అందజేస్తామన్నారు. అనంతరం డిజైనర్ నాగరాజు మాట్లాడుతూ త్వరలో జాతిపిత మహాత్మా గాంధీతో పాటు వెంకటేశ్వస్వామి తదితరు చిత్రాలను పట్టు వస్త్రాలపై ముద్రిస్తానన్నారు. ఈ సందర్భంగా పలువురు డిజైనర్ నాగరాజును అభినందించారు.













