తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు… వాయిదా

తెలంగాణలో జరగాల్సిన 6 ఎమ్మెల్సీ స్థానాలకు, ఆంధప్రదేశ్‍లో ఎమ్మెల్యేల కోటలో జరగాల్సిన 3 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల నిర్వహణ పక్రియను వాయిదా వేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కరోనా విజృంభిస్తున్న సమయంలో ఎన్నికల నిర్వహణకు పరిస్థితులు అనుకూలంగా లేవని కేంద్ర ఎన్నికల సంఘం పేర్కొంది. తెలంగాణలో 6 శాసనమండలి స్థానాలకు జూన్ 3తో గడువు మూగియనుండగా, ఆంధప్రదేశ్ రాష్ట్రంలో 3 శాసనమండలి స్థానాలకు ఈ నెల 31తో గడువు ముగియనుంది. కరోనా పరిస్థితులను బట్టి తదుపరి తేదీలను ప్రకటిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.