మిస్ టీన్ గ్లోబల్ ఇండియా విజేతగా… సంజన వరద

జైపూర్‌లో స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రొడక్షన్‌కి చెందిన ది పేజెంట్ స్టార్ మిస్ టీన్ ఇండియా నిర్వహించిన ఈవెంట్ మిస్ టీన్ గ్లోబల్ ఇండియా-2024 టైటిల్‌ను చంద్రగిరి చెందిన ఆలత్తూరు పావని, సుబ్రమణ్యం కుమార్తె సంజన వరద (18) గెలుచుకున్నారు. ఈ నెల 7-12 వరకు మలేసియాలోని కౌలాలంపూర్‌లో జరిగిన మిస్ టీన్ గ్లోబల్-2024 పోటీలో భారత్‌కు సంజన వరద ప్రాతినిథ్యం వహించింది. ఈ పోటీల్లో ఆమె 1వ రన్నరప్‌గా నిలిచింది.
సంజన బెంగళూరులో బీటెక్ ద్వితీయ సంవత్సరం చదువుతూ గతంలో జాతీయస్థాయిలో అవార్డును గెలచుకుంది. ఈ ప్రతిష్టాత్మక విజయంతో పాటు, సంజన వరద సోషల్ మీడియా ఇన్ ఫ్లుయన్స్ అవార్డు, పాపులర్ అవార్డును కూడా అందుకుంది. ఇంకా ఆమె తన పిత్తా ఫౌండేషన్ ద్వారా నిరుపేదలకు సహాయం చేయడంలో చేసిన కృషికి అత్యుత్తమమైన దాతృత్వ అవార్డుతో గ్లోబల్ సంస్థ సత్కరించింది. అంతర్జాతీయ స్థాయిలో మిస్ ఇండియా కీరిటాన్ని సాధించడమే తన ధ్వేయమని, దానికోసమే కష్టపడతానని స్టార్ మిస్ టీన్ ఇండియా గ్రహీత సంజన వరద అన్నారు.