దేశ ప్రయోజనాలకు అనుగుణంగానే.. భారత విదేశాంగ విధానం
దేశ ప్రయోజనాలను దృష్టితో పెట్టుకునే భారత విదేశాంగ విధానం ఉంటుందని, అందువల్ల ఉక్రెయిన్ సంక్షోభంతో వాణిజ్య సమస్యలను ముడిపెట్టాల్సిన అవసరం లేదని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్.జైశంకర్ పేర్కొన్నారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ విధానంగా స్థిరంగా, స్వష్టంగా ఉందని తెలిపారు. ఇరుపక్షాలు కాల్పులు విరమణ ప్రకటించి, చర్చల ద్వారా హింసకు స్వస్తి పలకాలంటూ భారత్ అది నుంచీ పిలుపునిస్తోందని తెలిపారు. రష్యా`ఉక్రెయిన్ వివాదం నేపథ్యంలో వివిధ వాణిజ్య చెల్లింపులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోందన్నారు. రష్యా నుంచి దిగుమతి చేసుకున్న చమురు చాలా తక్కువేనని తెలిపారు.













