నీట్ లేకున్నా… విదేశాల్లో చదువుకోవచ్చు!
విదేశీ యూనివర్సిటీల్లో వైద్య విద్యను అభ్యసించడానికి అడ్మిషన్ పొందిన విద్యార్థులకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎంసీఐ) శుభవార్త చెప్పింది. విదేశాల్లో మెడికల్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు ఈ ఏడాది నిర్వహించే నీట్ (యూజీ)-2020 పరీక్షలోగానీ లేదా వచ్చే ఏడాది నిర్వహించే నీట్ (యూజీ)-2021 లోగానీ అర్హత సాధించవచ్చని పేర్కొంది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టుకు వివరాలను వెల్లడించింది. కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఒక్కసారికి మాత్రమే ఈ వెసులుబాటు కల్పిస్తున్నట్టు వివరించింది. మలేషియాలో ఎంబీబీఎస్ సీటు పొందిన తన కుమార్తె ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో నీట్ ప్రవేశ పరీక్షకు హాజరుకాలేపోతున్నదని పేర్కొంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు.













