కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. కాంగ్రెస్ చీఫ్ ఖర్గేకు
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తున్నట్లు కేంద్ర హోం శాఖ అదేశాలిచ్చింది. ఆయన భద్రతకు ఉన్న ముప్పును పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒక అధికారి వివరించారు. దేశంలో ఆయన ఎక్కడికెళ్లినా సీఆర్పీఎఫ్ జవాన్లు వెన్నంటి ఉంటారు. రానున్న ఎన్నికల వేళ ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఖర్గే దేశవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది. అందుకే ఆయనకు భద్రత పెంచినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఇకపై ఆయనకు 24 గంటలపాటూ మూడు షిప్టులో 30 మంది సీఆర్పీఎస్ కమాండోలు రక్షణ కల్పిస్తారు. దీంతోపాటు బుల్లెట్ ప్రూఫ్ వాహనం, పైలట్, ఎస్కార్టు సమకూరుస్తారు.













