పీకే కీలక వ్యాఖ్యలు.. 2025 వరకు వేచిచూడక్కర్లేదు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్‌కు వ్యతిరేకంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ ముఖ్యమంత్రి పదవి కోసం ఆర్జేడీ అగ్ర నేత తేజస్వి యాదవ్ 2025 వరకు వేచి చూడాల్సిన అవసరం లేదని అన్నారు. ఆర్జేడీ, జేడీయూ సంకీర్ణ సర్కారులో అతిపెద్ద పార్టీ ఆర్జేడీయేనని, కాబట్టి ముఖ్యమంత్రి అయ్యే హక్కు తేజస్వికే ఉందన ఆయన పేర్కొన్నారు. నితీశ్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుని తేజస్వి యాదవ్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సలహా ఇచ్చారు. దానివల్ల తేజస్వీ యాదవ్‌కు వచ్చే ఎన్నికల నాటికి మూడేండ్ల పరిపాలన అనుభవం వస్తుందని, బీహార్ ప్రజలకు తేజస్వి పనితనాన్ని చూసి ఓటు వేసే అవకాశం లభిస్తుందని తెలిపారు.













