కరోనాతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి
మహారాష్ట్రలో కరోనా బారిన పడ్డ కాంగ్రెస్ ఎమ్మెల్యే రావు సాహెబ్ అంతపుర్కర్ (64) చనిపోయారు. కొవిడ్ పాజిటిట్ నిర్ధారణ అయిన తర్వాత ముంబైలోని ఓ ఆస్పత్రిలో రావు సాహేబ్ చేరి చికిత్స పొందారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఆయన పరిస్థితి విషమించడంతో వెంటిలేటర్ పై చికిత్ప పొందుతూ తుదిశ్వాస విడిచారు. నాందేడ్ జిల్లాలోని డేగ్లూరు నియోజకవర్గం నుంచి రావు సాహెబ్ గెలుపొందారు. మార్చి 19న రావు సాహెబ్‌కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో నాందేడ్ ఆస్పత్రిలో చేరి చికిత్ప పొందారు. మెరుగైన చికిత్స నిమిత్తం మార్చి 22న ముంబై ఆస్పత్రిలో చేరారు. మార్చి 28న ఆయనకు కరోనా నెగిటివ్ నిర్ధారణ అయింది. కానీ ఆయన ఐసీయూలోనే ఉన్నారు. ఎందుకంటే ఎమ్మెల్యే ఊపిరితిత్తుతులు, కిడ్నీలు పాడవడంతో వెంటిలేటర్‌పై చికిత్స పొందారు.













