25 దేశాలకు ఆహ్వానం కానీ… అమెరికాను ఆహ్వానించని బీజేపీ
ఈ ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. ఎన్నికల నేపథ్యంలో ప్రచార తీరును చూసేందుకు విదేశాలకు చెందిన రాజకీయ పార్టీలు త్వరలో భారత్‌కు రానున్నాయి. 25 దేశాలకు చెందిన ఆయా పార్టీలను కేంద్రంలోని బీజేపీ ఆహ్వానించింది. ఈ ఆహ్వానం మేరకు పార్టీల ప్రతినిధులు త్వరలో భారత్‌ను సందర్శించనున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టాలని ఆ పార్టీలు ఆకాంక్షిస్తున్నట్లు తెలుస్తోంది. 25 దేశాల రాజకీయ పార్టీలను ఆహ్వానించగా, వీటిలో ఇప్పటివరకు 13 ఆహ్వానాన్ని అంగీకరించాయి. జర్మనీ, బ్రిటన్, నేపాల్, బంగ్లాదేశ్ తదితర దేశాల్లోని పార్టీ ప్రతినిధులు రానున్నారు.
ఇదే ఏడాది అమెరికాలోనూ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడి పార్టీలను ఆహ్వానించలేదని సమాచారం. బ్రిటన్‌లోని కన్జర్వేటివ్ పార్టీ, లేబర్ పార్టీలతో పాటు జర్మనీకి చెందిన క్రిస్టియన్ డెమోక్రాట్లు, సోషల్ డెమోక్రాట్లను బీజేపీ ఆహ్వానించింది. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా చేసే ప్రచారాల్లో ప్రతినిధులు పాల్గొనున్నట్లు తెలుస్తోంది.













