‘ల్యాబ్‌క్యూబ్ కోవిడ్ సేఫ్టీ కీ’ ని ప్రారంభించిన కేంద్రహోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి
ల్యాబ్‌క్యూబ్ కంపెనీ మేకిన్ ఇండియాలో భాగంగా కొత్తగా తయారు చేసిన ‘కోవిడ్ సేఫ్టి కీ’ ని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్ రెడ్డి ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ఎన్నారై ఎంటప్రెన్యూరర్ శ్రీనివాస్ మానాప్రగడ, హైదరాబాద్‌కు చెందిన మల్లవరపు ఆరోగ్యరాజు కలిసి తయారు చేసిన కోవిడ్ సేఫ్టీ కీ అందరికీ ఉపయోగపడేలా, కరోనా వైరస్ నుంచి రక్షించేలా ఉందని అన్నారు. కరోనా వైరస్‌కు దూరంగా ఉండేందుకు అందరూ ఈ కోవిడ్ సేఫ్టి కీ’ ని ఉపయోగించాలని సూచించారు.
భారతదేశంలో మేకిన్ ఇండియా ప్రొడక్ట్‌గా తయారైన మొట్టమొదటి కోవిడ్ సేఫ్టి కీ ని ఆరోగ్యరాజు కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి అందజేశారు. శ్రీనివాస్ మానాప్రగడ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ?కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, కోవిడ్ 19 సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేపట్టిన చర్యలు, ఫ్రంట్‌లైన్ సిబ్బందికి, ఆసుపత్రులకు ఇచ్చిన ముందు జాగ్రత్త కిట్లు, ఇతర పరికరాల పంపిణీ వంటివి చూసి, ఆ స్ఫూర్తితో ల్యాబ్‌క్యూబ్ కంపెనీ సాధారణ ప్రజానీకం కోసం ఈ కోవిడ్ సేఫ్టి కీ ని తయారు చేసిందన్నారు. కోవిడ్ సేఫ్టి కీ ద్వారా లభించే ప్రయోజనాలను కిషన్‌రెడ్డికి వివరించి, ఈ పరికరాన్ని అన్నీ ప్రభుత్వ కార్యాలయాలలో ఏర్పోర్ట్లు, రైల్వే స్టేషన్లు, బ్యాంక్‌లలో, విద్యాలయాల్లో, కార్పొరేట్ కంపెనీల్లో, షాపింగ్ మాల్స్ ఇతర చోట్ల ఉపయోగించేలా చూడాలని కోరారు.
కోవిడ్ సేఫ్టి కీ ఏమిటి?
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందడంతో భారతదేశంతోపాటు అమెరికాలోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. బయటకు వెళితే సోకుతుందేమోనన్న భయం, ఎక్కడకు వెళ్ళినా, ఏది ముట్టుకున్నా కరోనా వస్తుందన్న భయం ప్రజలను మరింత ఇబ్బందుల్లో పడేస్తోంది. బహిరంగ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు ఎన్నో చోట్ల పరికరాలను తాకాల్సి ఉంటుంది. బస్సులో వెళ్ళినప్పుడు పైన ఉన్న రాడ్‌ను పట్టుకుంటాము. అలాగే ఎటిఎంకు వెళ్ళినప్పుడు నెంబర్ కీని తాకాల్సి ఉంటుంది. ఇలా ఎన్నో పరికరాలను మనం తాకాల్సి ఉంటుంది. వీటి ద్వారా వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా అని వీటిని ముట్టుకోకుండా ఉండలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో ఈ సమస్యను పరిష్కరించడానికి, ల్యాబ్‌క్యూబ్ LABCUBE) ముందుకు వచ్చింది. భారత్‌లో కోవిడ్ పరికరాలను తయారుచేసే స్టార్టప్ కంపెనీగా ఉన్న ల్యాబ్‌క్యూబ్ తమ ఉత్పత్తుల్లో భాగంగా ముందుగా కోవిడ్ సేఫ్టి కీ ని తయారు చేసింది.
అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న ఎంటప్రెన్యూరర్ సాంస్కృతిక రాయబారి శ్రీనివాస్ మానాప్రగడ, హైదరాబాద్‌లో ఉంటున్న ఎంటప్రెన్యూరర్ మల్లవరపు ఆరోగ్యరాజు కలిసి ప్రజలను కరోనా వైరస్ బారి నుంచి రక్షించడానికి విస్తృత ప్రయోజనాలు ఉన్న ఈ కోవిడ్ సేఫ్టి కీ పరికరాన్ని ఉత్పత్తి చేశారు. కరోనా వచ్చిన రోగి తాకిన ప్రదేశాలు లేదా పరికరాలు, ఉపరితలాన్ని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది. ప్రత్యేకమైన ఇత్తడితో దీనిని తయారు చేశారు. వైరస్ సాధారణంగా ఇతర లోహాలపై కన్నా ఇత్తడిపై కొద్దికాలం మాత్రమే బతుకుతుందని శాస్త్రవేత్తలు కూడా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కరోనా వచ్చిన రోగి తాకిన ప్రదేశాలు, లేదా పరికరాలు, ఉపరితలాన్ని ప్రత్యక్షంగా తాకకుండా ఉండేందుకు ఈ కీ ఉపయోగపడుతుంది.
కోవిడ్ సేఫ్టి కీ అమెరికాలో డిజైన్ చేయబడింది. ఇండియాలో తయారైంది. ప్రత్యేకమైన గ్రేడ్ ఇత్తడితో తయారు చేయబడిన సాధనం ఇది. బహిరంగ ప్రదేశాల్లో ఉపరితలాలను ఆపరేట్ చేయడానికి మరియు మంచినీటి నల్లాలు, ఎటిఎంలను ఆపరేట్ చేయడానికి, పిఓఎస్ మెషిన్లు, డోర్ ఓపెనర్, ట్రాలీ పుషర్, లిఫ్ట్ బటన్స్, కార్ డోర్స్ ఓపెన్ చేయడానికి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, హాస్పిటల్స్, వినోద ప్రదేశాలు, ప్రార్థనా స్థలాలు, హోటళ్ళు, క్లబ్బులు మొదలైన వాటికి వెళ్ళేటప్పుడు ఈ సేఫ్టి కీ ని వాడటం ద్వారా మనం కరోనా వైరస్ బారిన పడకుండా ఉంటాము.
పబ్లిక్ ప్రదేశాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ దీనిని ఉపయోగించాలని మేము కోరుకుంటున్నాము. వైరస్ నుంచి రక్షణకు ఇది అత్యంత అవశ్యకము. టచ్ స్క్రీన్లు, మొబైల్ ఫోన్లు, తలుపులు తెరవడం, ప్రజా రవాణ వాహనాల్లో హ్యాండిల్స్ పట్టుకోవడం, కారు తలుపులు తెరవడం, లిఫ్ట్ బటన్లు నొక్కడం మొదలైన వాటికి ఈ పరికరం వైరస్ నుంచి రక్షణను కల్పిస్తోందని మా పరీక్షల్లో తేలింది.
For details contact:
Mr. M. Arougya Raju, Managing Director & Partner
Mr. Srinivasa Manapragada, Managing Director & Partner (USA)
LABCUBE
Address: # 42-738, S.P. Nagar, Moula-Ali, Hyderabad, 500040, Telangana, INDIA. Ph: +91 9848016160
Overseas Address: # 2381, Bakers Way, San Ramon, CA, 94582, USA. +1 4082038905
Email: support@labcube.in Website: www.labcube.in













